భారతదేశం, నవంబర్ 24 -- నేత్ర మంతెన, వంశీ గదిరాజు పెళ్లి కొన్ని రోజులుగా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 23న జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వెళ్లాడు. అతనితో పాటు జెన్నిఫర్ లోపెజ్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంలో రామ్ చరణ్ పాల్గొన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

ఈ పెళ్లి వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినా.. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. చరణ్ పొడవాటి జుట్టు వదిలేసి, డార్క్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తో రామ్ చరణ్ సంభాషిస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చే...