భారతదేశం, మే 23 -- అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న విదేశీ విద్యార్థులను చేర్చుకునే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ విద్యార్థులు వేరే విద్యా సంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవాలని, లేదంటే వారు అమెరికాలో నివసించే హక్కును కోల్పోతారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది.

హార్వర్డ్ వర్సిటీ తన కళాశాలల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల వివరాలను ఇవ్వడానికి నిరాకరించిందని, క్యాంపస్ లో యూదు వ్యతిరేక, హమాస్ అనుకూల వాతావరణం సృష్టిస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆరోపిస్తోంది. అందువల్లనే హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న విదేశీ విద్యార్థులను చేర్చుకునే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని చెబుతోంది. అయితే, ఈ నిర్ణయం వెనుక ట్రంప్ వ్యక్తిగత కక్ష దాగ...