భారతదేశం, ఆగస్టు 9 -- ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖాముఖి కూర్చుని చర్చించే అవకాశం ఉంది. దీనిపై ప్రపంచం దృష్టి పడింది. మూడున్నరేళ్లుగా లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేసిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.

'అమెరికా అధ్యక్షుడిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వచ్చే శుక్రవారం యూఎస్‌లోని అలాస్కాలో సమావేశమవుతా.' అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. త్వరలోనే మరింత సమాచారం ఇవ్వనున్నారు. దశాబ్ద కాలంలో పుతిన్ అమెరికా పర్యటన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2015 సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు.

ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ తో చర్చిస్తానని, శాం...