భారతదేశం, ఆగస్టు 1 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించారని, అందువల్ల ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం సముచితమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ తన ఆరు నెలల పదవీ కాలంలో నెలకు ఒక శాంతి ఒప్పందాన్ని కుదిర్చారని ఆమె గురువారం వెల్లడించారు.

"ట్రంప్ ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్తాన్ వంటి ఆరు వివాదాలను పరిష్కరించారు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది" అని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. వైట్‌హౌస్ నుండి వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

"అధ్యక్షుడు ట్రంప్ థాయిలాండ్-కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, రువాండా-డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, భారత్-పాకిస్తాన్, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య ఉన్న వివాదాలను ముగించారు. దీని అర్థం, ఆయన తన ఆర...