భారతదేశం, సెప్టెంబర్ 22 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 388 పాయింట్లు పడి 82,626 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 97 పాయింట్లు కోల్పోయి 25,327 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 269 పాయింట్లు పడి 55,459 వద్దకు చేరింది.

భారత టెక్​ ఉద్యోగులకు అత్యంత కీలకమైన హెచ్​1బీ వీసా ఫీజును భారీ పెంచి అందరికి షాక్​ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇది టెక్​ సెక్టార్​పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లోని టెక్​ సెక్టార్​పై ఫోకస్​ ఉండనుంది.

ట్రంప్​ హెచ్​1బీ వీసా ఫీజు పెంపు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 351.88 కోట్...