భారతదేశం, మే 18 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‍డమ్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ స్పై యాక్షన్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మే ఆఖర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ తరుణంలో తాజాగా ఓ పోడ్‍కాస్ట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. షూటింగ్ ఫినిష్ అయ్యాక ఓ మూవీ రిలీజ్ వద్దనుకున్న విషయాన్ని వెల్లడించారు.

ట్యాక్సీవాలా సినిమా షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ వద్దని నిర్మాత అల్లు అరవింద్ అన్నారని విజయ్ దేవరకొండ తెలిపారు. ఆ తర్వాత ఏం చేశారో వివరించారు. ట్యాక్సీవాలా ఫైనల్ కట్ చూసి తనను ప్రొడ్యూజర్లు హైదరాబాద్‍కు పిలిచారని, చెన్నైలో ఉన్న తాను హుటాహుటిన వచ్చానని విజయ్ తెలిపారు. ఈ సినిమా వర్కౌట్ కాదని, తర్వాతి సినిమాను గ్రాండ్ రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్ తనత...