భారతదేశం, జనవరి 27 -- టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతున్న రిలేషన్షిప్ రూమర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బదే. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో అటు ఈషా, ఇటు తరుణ్ వీటిపై స్పందించారు. ఒక రోజు ముందే ఈషా ఈ వార్తలను ఖండించగా.. తరుణ్ మాత్రం టైమ్ వచ్చినప్పుడు చెప్తానంటూ ఇంకా ఉత్కంఠను పెంచాడు.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి నటించిన ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ఈ శుక్రవారం (జనవరి 30) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్.. ఈషాతో తన రిలేషన్షిప్ పై మాట్లాడాడు. "దీనిని అనౌన్స్ చేయడానికి నేను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ఈషా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ. ఒక తోడుగా, గత కొన్నేళ్లుగా ఆమె నాకు అన్నీ తానై ఉంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి నేను చేసే ప్రకటన ఇతరులపై కూడా ప్...