భారతదేశం, అక్టోబర్ 28 -- నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుసు కదా. ఈ మధ్యే పవన్ కల్యాణ్ నటించిన ఓటీ మూవీలో విలన్ గా కనిపించాడు. ప్రస్తుతం యామీ గౌతమ్‌తో కలిసి నటించిన తన రాబోయే మూవీ 'హక్' (Haq) విడుదల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు యాక్టర్స్ సమయానికి సెట్స్ కు రావడం, రాకపోవడంపై అతడు స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఓజీ మూవీలో విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మి ఈ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా యాక్టర్స్ సమయానికి సెట్స్ కి రావడంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అతడు స్పందించాడు. తన హక్ మూవీ కోస్టార్ యామీ గౌతమ్ ప్రొఫెషనలిజాన్ని ప్రశంసించాడు. "నేను ఇదంతా ముందే ఊహించాను. ఆమె ప్రొఫెషనలిజం నాకు తెలుసు. సెట్స్ కు సమయానికి వచ్చే కొద్ది మంది యాక్టర్స్ లో ఆమె ఒకరు. నాలాగే. అందులో సమస్య లేదు" అని అన్నాడు.

ఇప్పటిక...