Hyderabad, ఏప్రిల్ 19 -- డయాబెటిస్ బారిన పడని ఇబ్బంది పడుతున్నవారు తక్కువేమీ కాదు. మారుతున్న జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా ఈ రోజుల్లో డయాబెటిస్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. అయితే ఇప్పటివరకు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గురించే ఎక్కువ మందికి తెలుసు. గర్భం ధరించాక వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్ పేరు కూడా వినే ఉంటారు. కానీ ఇప్పుడు మరో కొత్త రకం డయాబెటిస్ పుట్టుకొచ్చింది. అదే టైప్ 5 డయాబెటిస్.

టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు టైప్ -5 డయాబెటిస్ వెలుగులోకి వచ్చింది. ఇది కొత్తగా గుర్తించిన వర్గం. ఇది ప్రధానంగా తక్కువ బరువు ఉన్న వ్యక్తులలో వస్తుంది.

టైప్ -5 డయాబెటిస్ అనేది కొత్తగా గుర్తించిన డయాబెటిస్ వర్గం. పోషకాహా...