భారతదేశం, డిసెంబర్ 23 -- స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రౌడీ జనార్ధన. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ చేస్తోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా డిసెంబర్ 22న రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రౌడీ జనార్ధన డైరెక్టర్ రవి కిరణ్ కోలా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ.. "మీ అందరి లాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. నేను అభిమానించే కీర్తి సురేష్, రాజు గారు వంటి వారితో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. రౌడీ జనార్థన టైటిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా" అని అన్నారు.

"రౌడీ జనార్థన ఎలా ఉంటాడో పరిచయం...