భారతదేశం, జనవరి 22 -- ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ (Academy Awards) నామినేషన్ల పర్వం మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని అకాడమీకి చెందిన శామ్యూల్ గోల్డ్‌విన్ థియేటర్‌లో గురువారం (జనవరి 22) జరిగిన కార్యక్రమంలో నటులు లూయిస్ పుల్‌మాన్, డానియెల్ బ్రూక్స్ ఈ నామినేషన్లను అధికారికంగా ప్రకటించారు.

రయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన 'సిన్నర్స్' (Sinners) మూవీ ఆస్కార్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమా అత్యధికంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. గతంలో 'ఆల్ అబౌట్ ఈవ్', 'టైటానిక్', 'లా లా ల్యాండ్' సినిమాలు 14 నామినేషన్లతో రికార్డు సృష్టించగా.. ఇప్పుడు 'సిన్నర్స్' వాటన్నింటినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. వీటిలో బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ మేల్, బెస్ట్ యాక్టర్ ఫిమేల్, బెస్ట్ డైరెక్టర్ లాంటి కేటగిరీలు...