Hyderabad, మే 13 -- విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. సోమవారం (మే 12) కోహ్లి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ఈ దంపతులు తాము ఎంతగానో విశ్వసించే బృందావన్ లోని స్వామీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ ను కలవడానికి వెళ్లడం విశేషం.

విరాట్ కోహ్లి, అనుష్క ఇద్దరూ దేవుడిని బలంగా నమ్ముతారు. సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బృందావన్ లోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ ఆశ్రమానికి వెళ్తుంటారు. తాజాగా తాను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కోహ్లి, అనుష్క దంపతులు అక్కడికే వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమ పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి కోహ్లి, అనుష్క ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ స...