Hyderabad, ఏప్రిల్ 25 -- మొటిమలు.. చాలా మంది టీనేజర్లు, యువతీ యువకులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య! మొహం మీద చిన్న మొటిమ కనపడితే చాలు చిరాకు పడుతుంటారు. సమస్య తీవ్రమైతే రకరకాల క్రీములు, మందుల కోసం ఎగపడతారు. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మొటిమలకు కారణం కేవలం దుమ్ము, ధూళి, లేదా హార్మోన్ల మార్పులు మాత్రమే కావు. అందిరి లైఫ్‌లో ఉండే మరొక సైలెంట్ విలన్ కూడా అయి ఉండచ్చు. అదే ఒత్తిడి! అవును, మీరు విన్నది నిజమే. మనం రోజూ ఫేస్ చేసే టెన్షన్లు, ఆందోళనలు మొటిమల రూపంలో మన అందాన్ని పాడుచేయగలవు. ఈ ఒత్తిడికి, మొటిమలకు ఉన్న సంబంధం ఏంటి? టెన్షన్లు పెరిగితే మొటిమలు పెరుగతాయా? వంటి విషయాలను తెలుసుకునే ప్రయ్నతం చేద్దాం రండి.

ఒత్తిడి నేరుగా మొటిమలను సృష్టించకపోయినా, మన శరీరంలో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ గందరగోళం వల్ల మొటిమలు ఏర్పడతాయి, ఉ...