భారతదేశం, జనవరి 16 -- ప్రముఖ భారతీయ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, కంపెనీ తన లాభదాయకతను పెంచుకుంటూ ఇన్వెస్టర్లలో భరోసా నింపింది. ఈ త్రైమాసికంలో నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి చెంది రూ. 1,122 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ. 983.2 కోట్లుగా ఉంది.

కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue) 8 శాతం పెరిగి రూ. 14,393 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.8 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక నిర్వహణ పనితీరు (EBIT) విషయానికి వస్తే, ఏకంగా 40.1 శాతం పెరుగుదలతో రూ. 1,892 కోట్లకు చేరింది. దీనివల్ల ఎబిట్ మార్జిన్ 13.1 శాతానికి మెరుగుపడటం విశేషం.

టెక్ మహీంద్రా ఈసారి భారీ డ...