భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రస్తుతం టెక్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ప్లాట్‌ఫారమ్ 'క్లాడ్' (Claude) బుధవారం ఒక్కసారిగా మొరాయించింది. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఈ ఏఐ అసిస్టెంట్ వెబ్‌సైట్, చాట్ ఫంక్షన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వెబ్‌సైట్ రూపం అస్తవ్యస్తంగా మారిపోవడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

డౌన్ డిటెక్టర్ (Downdetector.com) గణాంకాల ప్రకారం.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో (అమెరికాలో మంగళవారం సాయంత్రం) ఈ సమస్య మొదలైంది. సుమారు 3,000 మందికి పైగా యూజర్లు క్లోడ్ సేవలు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. క్లాడ్ వెబ్‌సైట్ పరిస్థితిని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

"క్లాడ్ ఏఐ ప్రస్తుతం 1995 కాలం నాటి వెబ్‌సైట్‌లా ...