భారతదేశం, ఆగస్టు 7 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం, ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో ఇది ఒకటి.

ఈ పథకానికి 'స్త్రీ శక్తి' అనే పేరు పెట్టారు. దీని అమలు కోసం ఏటా సుమారు రూ.1,942 కోట్లు (నెలకు దాదాపు రూ.162 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకం ద్వారా మహిళలకు విద్య, ఉద్యోగం, ఇతర ప్రయాణ అవకాశాలు మెరుగుపడి, మరింత సాధికారత లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పథకం కొన్ని జిల్లాలకే పరిమితం అవుతుందనే వార్తలను పార్థసారథి ఖండించారు. ''అలాంటి వార్తలు వచ్చాయి. కానీ, ఈ పథ...