భారతదేశం, జూలై 9 -- అమెరికాలోని టెక్సాస్‌లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా గ్వాడాలుపే నది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వరదలు సంభవించాయి. ఈ విపత్తులో 110 మందికి పైగా మరణించారు. అనేక శిబిరాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తప్పిపోయిన తమ వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. అదేవిధంగా టెక్సాస్‌లోని హంట్, కంఫర్ట్ మరియు కెర్విల్లే కౌంటీలలో భారీ వర్షాలు కొనసాగుతాయని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.

కొన్ని రోజులుగా అమెరికాను ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు, తుఫానులు, వైల్డ్ ఫైర్, కుండపోత వర్షాలతో అమెరికన్లు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చులు అమెరికన్లను సర్వనాశనం చేశాయి. ఇప్పుడు టెక్సాస్ తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.

టెక్సాస్ వరదల్లో ...