భారతదేశం, జనవరి 28 -- అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు టెక్సాస్ ప్రభుత్వం షాకిచ్చింది. "టెక్సాస్ పౌరులకే తొలి ప్రాధాన్యం" (Texans Come First) అనే నినాదంతో గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా హెచ్-1బీ (H-1B) వీసాదారులను నియమించుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర పౌరులకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

"టెక్సాస్ పన్ను చెల్లింపుదారులు మన వర్క్‌ఫోర్స్ శిక్షణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ ఉద్యోగాలు మన టెక్సాస్ వాసులకే దక్కాలి" అని అబాట్ తన ఎక్స్‌ (X) వేదికగా స్పష్టం చేశారు.

ఫెడరల్ హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో ...