భారతదేశం, జనవరి 10 -- భారత పెయింట్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న 'టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్' ఒక కీలక ప్రకటన చేసింది. 'క్రికెట్ గాడ్​', భారతరత్న సచిన్ టెండూల్కర్‌ను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్ల పాటు సచిన్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, సచిన్ రాకతో తన బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా మరింత బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది.

"ప్రపంచ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్‌తో చేతులు కలపడం మాకు దక్కిన గౌరవం. ఈ ఏడాది మేము ఐపీఓకు వెళ్లడంతో పాటు వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నాము. మా వృద్ధి ప్రయాణానికి సచిన్ కంటే మెరుగైన పార్ట్‌నర్ మరొకరు ఉండరు," అని టెక్నో పెయింట్స్ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్...