భారతదేశం, ఆగస్టు 5 -- హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) 2025 జూలై నెలలో రికార్డు సృష్టించింది. ఈ నెలలో 5.15 లక్షల యూనిట్లను విక్రయించడం ద్వారా హీరో మోటోకార్ప్‌ను అధిగమించి హోండా దేశంలో కొత్త నంబర్-1 ద్విచక్ర వాహన బ్రాండ్‌గా అవతరించింది. గత నెలలో హీరో 4,49,755 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దాని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

జూలై 2025 భారతదేశంలోని అనేక ద్విచక్ర వాహన కంపెనీలకు చాలా మంచిగా ఉంది. హీరో మోటోకార్ప్ 21 శాతం వార్షిక వృద్ధిని సాధించినప్పటికీ హోండా కంటే వెనుకబడి ఉంది. హోండా ఇప్పుడు భారతదేశంలో నంబర్ 1 ద్విచక్ర వాహన తయారీదారుగా మారింది. హోండా ద్విచక్ర వాహన అమ్మకాలు 5,15,378 యూనిట్లుగా ఉండగా హీరో మోటోకార్ప్ 4,49,755 యూనిట్లుగా ఉన్నాయి.

జూలై 2025లో తమ అమ్మకాలు బాగా పెరిగాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. కంపెనీ అమ్మకాలు...