Hyderabad, జూన్ 2 -- మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్న ఈ కాలంలో ఓ శరణార్థిగా మన దేశానికిి వచ్చిన కుటుంబం.. తమ చుట్టూ ఉన్న వాళ్లలో ప్రేమానురాగాలను ఎలా నింపిందో చూపించేదే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ. వందల కోట్ల కలెక్షన్లంటూ ఫక్తు కమర్షియల్ సినిమాలనే నమ్ముకుంటున్న ఈ కాలంలో.. మానవ సంబంధాల విలువను చాటి చెబుతూ ఓ మంచి ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి.

కానీ ఆ సాహసంతోనే అదిరిపోయే విజయం అందుకున్నాడు దర్శకుడు అబిషన్ జీవింత్. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.85 కోట్లు వసూలు చేసిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జియోహాట్‌స్టార్ ఓటీటీలో సోమవారం (జూ్ 2) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. ధర్మదాస్, వసంతి అనే పా...