భారతదేశం, డిసెంబర్ 1 -- విశాఖ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జిని డిజైన్ చేశామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్పారు. అతి త్వరలో కైలాసగిరి త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. వీఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నట్టుగా పేర్కొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.

కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన స్కైవాక్‌ గ్లాస్ బ్రిడ్జి ఇది. ఈ స్కైవాక్ నుంచి చూస్తే.. అందమైన తీరప్రాంతాన్ని, అద్భుతమైన ప్రకృతిని ఆస్వ...