భారతదేశం, నవంబర్ 25 -- భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం (నవంబర్ 25) ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో అనౌన్స్ చేసింది. క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూసే ఇండియా, పాకిస్థాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇదే కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ మెగా టోర్నీకి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం విశేషం. ఇక భారీ అంచనాలున్న ఇండియా, పాకిస్థాన్ పోరు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఇది గ్రూప్ దశలో భారత్‌కు మూడో మ్యాచ్. రోహిత్ శర్మ కెప్ట...