భారతదేశం, జనవరి 28 -- భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకా సందిగ్ధంలోనే ఉంది. భద్రతా కారణాల రీత్యా భారత్‌కు రాలేమని చెప్పిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఐసీసీ కఠినంగా ఉండటంతో ఆ టీమ్ తప్పుకోక తప్పలేదు. దీనికి నిరసనగా, బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలుపుతూ తాము కూడా వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ యోచిస్తోంది. అయితే ఈ ఆలోచనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, మొహమ్మద్ హఫీజ్, మోసిన్ ఖాన్ వంటి వారు పీసీబీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఐసీసీతో గొడవ పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ఆందో...