భారతదేశం, అక్టోబర్ 29 -- భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. 360 డిగ్రీల ఆటతీరుతో అదరగొట్టే సూర్య సిక్సర్ల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం (అక్టోబర్ 29) కానెబెర్రాలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టీ20లో సూర్య అరుదైన ఫీట్ అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల లిస్ట్ లో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో సిక్సర్లతో అదరగొట్టాడు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరైన సమయంలో ఫామ్ అందుకున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేకమైన టీ20 మైలురాయిని చేరుకున్నాడు. టీ20లలో 150 సిక్సర్లు కొట్టిన ఐదవ బ్యాటర్‌గా సూర్య నిలిచాడు.

ఇండియన్ బ్యాటర్లలో రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బ్యాటర్ సూర్యకుమార్. 10వ ఓవర్ మూడో బంతికి ఎల్లిస్ స్టంప్స్ ల...