భారతదేశం, నవంబర్ 28 -- రెండు దశాబ్దాల కిందట టీవీ ద్వారానే బాలీవుడ్ నటి మోనా సింగ్‌కు మంచి గుర్తింపు లభించింది. కానీ ఇప్పుడా టీవీకి తాను పూర్తిగా దూరమయ్యానని ఆమె చెప్పడం విశేషం. టీవీకి తిరిగి రావాలనే కోరిక తనకు లేదని, ఎందుకంటే అందులో చేయగలిగినదంతా చేసేశానని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు టీవీ నటీనటులకు అసలు వ్యక్తిగత జీవితం ఉండదేమో అని అనడం గమనార్హం.

'బాంబే టైమ్స్'కు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి మోనా సింగ్ తన కెరీర్ ప్రయాణం, ఓటీటీ షోలకు మారడం గురించి మాట్లాడింది. ఈ రెండింటి మధ్య తేడా గురించి నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "ఒక వెబ్ షోపై మూడు నెలలు పనిచేయడం చాలా పర్ఫెక్ట్. ఆ తర్వాత మీకు బ్రేక్ దొరుకుతుంది. మళ్లీ ఫ్రెష్‌గా తిరిగి వచ్చి కొత్త పాత్రలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఓటీటీ నాకు బెస్ట్ అనిపిస్తుంది" అని అభిప్ర...