Hyderabad, జూలై 25 -- స్టార్ మా సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆ ఛానెల్ సీరియల్సే టీఆర్పీల్లో టాప్ లో ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు టీవీ ఎంటర్టైన్మెంట్ షోలలోనూ ఆ ఛానెల్ సత్తా చాటుతోంది. ఈటీవీని వెనక్కి నెట్టి స్టార్ మాలో వచ్చే కుకు విత్ జాతిరత్నాలు షో తొలి స్థానంలో నిలవడం విశేషం. ఈ మధ్యే ఆ ఛానెల్లో ప్రారంభమైన షో ఇది.

తెలుగు టీవీ షోస్ కి సంబంధించి 28వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో స్టార్ మాలో వచ్చే కుకు విత్ జాతిరత్నాలు టాప్ లో నిలిచింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉన్న ఈ కామెడీ రియాల్టీ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఈవారం ఈ షోకి ఏకంగా 5.49 రేటింగ్ వచ్చింది.

తెలుగు షోలలో ఇదే అత్యధిక రేటింగ్ కావడం విశేషం. తమిళ షో కుకు విత్ కోమలిని తెలుగులో ఇలా కుకు విత్ జాతిరత్నాలుగా...