భారతదేశం, ఏప్రిల్ 20 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది జనవరి 10న విడుదలైన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ మూవీకి నిరాశ ఎదురైంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఓటీటీల్లో మోస్తరు వ్యూస్ దక్కాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. టెలికాస్ట్ డేట్, టైమ్ ఫిక్స్ అయ్యాయి.

గేమ్ ఛేంజర్ చిత్రం ఏప్రిల్ 27వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ వివరాలను ఆ ఛానెల్ అధికారికంగా వెల్లడించింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వస్తోంది జీ తెలుగు. ఎట్టకేలకు ఏప్రిల్ 27న సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు తాజాగా కన్ఫర్మ్ చేసింది.

గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీట...