భారతదేశం, డిసెంబర్ 19 -- ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌​లతో సాగే సీరియళ్లను అందిస్తున్న ఛానెల్ జీ తెలుగు. అలాంటి జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌​ను అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనంతో ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక 'లక్ష్మీ రావే మా ఇంటికి'.

భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలు, కుటుంబ సవాళ్లతో అల్లుకున్న కథతో 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ రూపొందినట్లు మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్​ 22న అంటే సోమవారం నుంచి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు జీ తెలుగులో లక్ష్మీ రావే మా ఇంటికి టీవీ ప్రీమియర్ కానుంది.

'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ కథ అనుకోకుండా ముడిపడిన రెండు జీవితాల చుట్టూ తిరుగుతుంది. అనాథగా పెరిగిన తెలివిగల ...