భారతదేశం, జూన్ 22 -- యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది. ఓటీటీలోనూ ఈ చిత్రం అదరగొట్టింది. ఇప్పుడు తొలిసారి టీవీలో ప్రసారమయ్యేందుకు తండేల్ మూవీ రెడీ అయింది.

తండేల్ సినిమా జూన్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. కొంతకాలంగా త్వరలో ప్రసారం అంటూ ఆ ఛానెల్ చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు డేట్, టైమ్ కన్ఫర్మ్ చేసింది. జూన్ 29న సాయంత్రం 6 గంటలకు తండేల్ టీవీ ప్రీమియర్ అంటూ జీ తెలుగు అధికారికంగా ఓ ప్రోమో తీసుకొచ్చింది.

తండేల్ చిత్రంలో మత్య్సకారుడు రాజు పాత్రను నాగచైతన్య పోషించారు. ప...