భారతదేశం, సెప్టెంబర్ 4 -- టీవీఎస్ ఎన్‌టార్క్ 150 (Ntorq 150) కొత్త ప్రీమియం స్కూటర్. దీని ధర రూ. 1.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. ఈ మోడల్ దేశీయ మార్కెట్లో హీరో జూమ్ 160 (Hero Xoom 160), యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155), ఏప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఎన్‌టార్క్ 150 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అధునాతన టీఎఫ్‌టీ క్లస్టర్‌తో వచ్చే టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 1,29,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. స్టాండర్డ్ మోడల్ స్టీల్త్ సిల్వర్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ రంగుల్లో లభిస్తుంది. టీఎఫ్‌టీ వేరియంట్ మాత్రం నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఎన్‌టార్క్ 150 చూడటానికి జెట్ విమానం (stealth aircraft) డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇందులో జెట్-ఇన్‌స్పైర్డ్ వెంట్లు...