Hyderabad, జూలై 1 -- ఇండియాలో క్రికెట్, సినిమాలు రెండింటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానం కాదు.. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చి అని కూడా అనొచ్చు. అందుకే, అప్పుడప్పుడూ క్రికెట్ ఆటగాళ్లు నటన వైపు మొగ్గు చూపడం సహజమే. సౌరవ్ గంగూలీ, శ్రీశాంత్ లాంటి వాళ్లు చిన్నా చితకా రోల్స్ చేశారు.

అది అభిరుచి కావచ్చు, అవసరం కావచ్చు. అలాంటి ఒక ఆసక్తికరమైన కథే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఒక స్టార్ స్పిన్ బౌలర్‌ది. అతడు ఒకప్పుడు తమిళ సినిమాలో కేవలం రూ.600కి జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడంటే నమ్మగలరా?

టీమిండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి తన క్రికెట్, సినిమా జర్నీ గురించి టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్‌తో యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నాడు. ఇప్పుడు 33 ఏళ్ల వరుణ్, తనకు 26 ఏళ్ల వయసులో క్రికెట్‌పై నిజమైన ఆసక్తి ఏర్పడిందని చెప్పాడు. అంతకు ముందు అతడు గిటారిస్ట...