భారతదేశం, అక్టోబర్ 31 -- ఆస్ట్రేలియాలో ఇండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత టీ20 సిరీస్ కిక్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ టీ20 వర్షంతో రద్దయింది. ఇక మెల్ బోర్న్ లో ఇవాళ (అక్టోబర్ 31) జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటింగ్ మెరుపులు చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు తీవ్రమైన నిరాశ తప్పలేదు. సెకండ్ టీ20లో బ్యాటింగ్ లో ఇండియా కుప్పకూలింది. అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది.

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆసీస్ పేస్ దెబ్బకు ఇండియా బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. హేజిల్ వుడ్ 3, నేథన్ ఎలిస్ 2, జేవియర్ 2 వికెట్లతో టీమిండియాను దెబ్బ కొట్టారు.

శుభ్ మన్ గిల్ (5), శాంసన్ (2), సూర్యకుమార్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ (7), శివమ్ దూబె (4), కుల్ ద...