భారతదేశం, జూలై 6 -- 58 ఏళ్లుగా బర్మింగ్ హమ్ కోటను బద్దలు కొట్టడానికి టీమిండియా దండయాత్ర చేస్తూనే ఉంది. అక్కడ ఇంగ్లాండ్ తో 8 టెస్టులాడింది. ఏడో ఓడింది. ఒక్కటి డ్రా చేసుకుంది. కానీ విజయం మాత్రం దక్కలేదు. దశాబ్దాలు గడిచాయి. అర్ధశతాబ్దం పూర్తయింది. కానీ నిరాశ తప్పలేదు. ఇప్పుడా నిరాశను దాటి భారత క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. బర్మింగ్ హమ్ లో తొలి టెస్టు విక్టరీ సాధించింది. అంతే కాకుండా పరుగుల పరంగా విదేశాల్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది.

రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఆదివారం (జూలై 6) ముగిసిన మ్యాచ్ లో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ టెస్టుల్లో తొలిసారి అయిదు వికెట్ల ఘనత సాధించాడు. అతను మొత్తం 6 వికెట్లు ఖాతాలో వేసుక...