భారతదేశం, అక్టోబర్ 28 -- ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.. బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ మ్యాచ్ లో టీమిండియాకు స్లో ఓవర్ రేట్ కారణంగా విధించాల్సిన ఫైన్ ను తప్పించాలని తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని వెల్లడించాడు. ఆ సమయంలో నిబంధనల అమలులో క్రికెట్ రాజకీయాల పాత్రను ఇది ఎత్తి చూపిందని బ్రాడ్ అన్నాడు.

ది టెలిగ్రాఫ్ తో మాట్లాడుతూ టీమిండియా స్లో ఓవర్ రేట్ ను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని క్రిస్ బ్రాడ్ చెప్పాడు. ఆ మ్యాచ్ ఏది అన్నది తెలపలేదు. కానీ ఆ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ నిర్దిష్ఠ సమయం లోపు మూడు లేదా నాలుగు ఓవర్లు వెనుకబడి ఉందని బ్రాడ్ అన్నాడు. అప్పుడు రూల్స్ ప్రకారం ఫైన్ వేయాల్సిందని చెప్పాడు.

తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని క్రిస్ బ్రాడ్ తెలిపాడు. ''మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగ...