భారతదేశం, జూలై 6 -- ఇండియాతో రెండో టెస్టు.. ఇంగ్లాండ్ టార్గెట్ 608 రన్స్. ఆ టీమ్ గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వికెట్లు పడ్డాయి. భారత్ గెలవాలంటే చివరి రోజు ఆటలో మరో ఏడు వికెట్లు పడగొట్టాలి. ఎలా చూసుకున్నా భారత్ కే గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ టీమిండియా అవకాశాలపై వరుణుడు దెబ్బకొట్టేలా కనిపిస్తున్నాడు. ఆదివారం (జూలై 6) బర్మింగ్ హమ్ లో ఆట స్టార్ట్ కాకుండా వర్షం అంతరాయం కలిగిస్తోంది.

ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టులో చేజేతులారా భారత్ ఓడింది. కానీ రెండో టెస్టులో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపు బాటలు వేసుకుంది. ఇంగ్లిష్ టీమ్ కు ఏకంగా 608 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. నాలుగో రోజే (జూలై 5) మూడు వికెట్లు పడగొట్టింది. ఈ రోజు మిగిలిన వికెట్లు త్వరగా పడగొట్టి గెలిచేయాలని అనుకుంది. కానీ టీమిండియా జోరుకు వాన బ్రేక్ వేసిం...