భారతదేశం, జూలై 21 -- ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్. ఇప్పటికే అయిదు టెస్టుల సిరీస్ లో భారత క్రికెట్ జట్టు 1-2తో వెనుకబడి ఉంది. సిరీస్ లో ఇంకా రెండు టెస్టులున్నాయి. ఇందులో ఒక్కటి ఓడినా సిరీస్ పోయినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ అర్ష్ దీప్ సింగ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు.

ఇండియన్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన అండర్సన్-టెండూల్కర్ సిరీస్ లోని రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. బుధవారం, జూలై 23న ప్రారంభం కానున్న మాంచెస్టర్ టెస్ట్‌కు సన్నద్ధతలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీసీసీఐ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఎడమ మోకాలి గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి స...