Hyderabad, సెప్టెంబర్ 25 -- క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అభిమానుల కోసం మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ వస్తోంది. జియోహాట్‌స్టార్ స్పెషల్స్ గా వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ఎంతో ఆసక్తిగా సాగింది. అక్టోబర్ 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ కథేంటి? ఆ హత్యకు గురైంది ఎవరు? అది చేసింది ఎవరు అనే విశేషాలు చూడండి.

జియోహాట్‌స్టార్ ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ అనే ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సిరీస్ అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. నీళ్లలో పడిపోయిన కారును బయటకు తీయడం, అందులో నైనా అనే ఓ టీనేజీ అమ్మాయి శవం ఉండటం మొదట్లోనే చూపిస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు ఏసీపీలు రంగంలోకి దిగుతారు.

ఏసీపీ సంయు...