Telangana,hyderabad, జూలై 1 -- అసలు పేరు ఠాకూర్ రాజాసింగ్ లోథ్‌ .... సాధారణంగా 'రాజాసింగ్' అంటారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఓ వార్నింగ్ ఇస్తే పెద్ద రచ్చ జరగాల్సిందే..! గోరక్ష పేరుతో స్వయంగా అతనే రంగంలోకి దిగుతుంటారు..! హిందూ ధర్మ రక్షణే తన ధ్యేయం అంటూ దూకుడుగా ముందుకెళ్తుంటారు. కట్ చేస్తే తాజాగా సొంత పార్టీ నాయకత్వంపైనే గళాన్ని విప్పారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఏకంగా బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను విడుదల చేశారు. దీంతో రాజాసింగ్ వ్యవహారం మరో హాట్ టాపిక్ గా మారింది.

హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా పని చేసే రాజాసింగ్. రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగానే ఉంది. గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన... శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణ...