భారతదేశం, డిసెంబర్ 11 -- టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు-13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు - 75 వేలు, పెద్ద డైరీలు - 8.50 లక్షలు, చిన్నడైరీలు - 3 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు - 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు - 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు - 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు - 10 వేలను అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.

12 పేజీల క్యాలెండర్ రూ.130, డీలక్స్ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75, 6 పేజీల 3డి డిజిట‌ల్‌ క్యాలెండర్ రూ.450, శ్రీవారి ...