భారతదేశం, డిసెంబర్ 10 -- టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తుల నుంచి విలువైన అభిప్రాయాన్ని సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేలను ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తోంది.

ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజ్ కౌంటర్ మరియు ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఇక వాట్సాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. ఆ ప్రాసెస్ వివరాలు ఎలాగో ఇక్కడ చూడండి...

తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ ...