భారతదేశం, జూలై 22 -- తిరుమలలో జరిగిన తితిదే పాలకమండి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించిన‌ట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.

తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు(లాంజ్ లు) ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయనున్నారు.

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైట...