భారతదేశం, డిసెంబర్ 23 -- ముఖ్యమంత్రివ‌ర్యులు చంద్రబాబు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వహించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శనాల్లో సామ‌న్యుల‌కే పెద్దపీఠ వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్‌లో వైకుంఠ ద్వార ద‌ర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియ‌మించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘంలోని రాష్ట్ర హోంశాఖ‌ మంత్రి అనిత‌, రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్రసాద్‌ల‌తో క‌లిసి ఆయ‌న టీటీడీ, జిల్లా, పోలీసు ఉన్నతాధికారుల‌తో ఉన్నత‌స్థాయి స‌మావేశం నిర్వహించారు.

ఈ స‌మావేశంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్‌.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, దేవాదాయ‌శాఖ సెక్రట‌రీ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జిల్లా క‌లెక్టర్ వెంక‌టేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మ...