భారతదేశం, మే 20 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల్లో 597 పోస్టులు భర్తీ చేయాలని.. పాలకమండలి నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు మేరకు.. స్విమ్స్‌ను అభివృద్ధి చేస్తామని.. టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

'శ్రీవారి వైద్యసేవ ద్వారా ఆసక్తి ఉన్న వాలంటీర్స్ ద్వారా స్విమ్స్‌లో సేవలు ప్రారంభించాలని నిర్ణయించాం. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఎస్‌కు అంగీకరిస్తే.. రిటైర్డ్ బెనిఫిట్స్ తోపాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది' అని టీటీడీ ఈఓ శ్యామలరావు వివరించారు.

'మఠాల ఆక్రమణలపై పరిశీలన జరుగుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు...