భారతదేశం, నవంబర్ 15 -- టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాం లభ్యమైంది. తిరుమలోని పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేసులో సతీశ్‌కుమార్‌ ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు.

అనంతపురం జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. సతీష్ కుమార్ మృతదేహాన్ని రైల్వే పట్టాలపై గుర్తించామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్ష ఫలితాలం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం సమయంలో రైల్వే కార్మికులు సాధారణ నిర్వహణ పనుల సమయంలో మృతదేహాన్ని చూశారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తిరుమల పరకామణిలో...