భారతదేశం, మే 11 -- తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ విద్యాశాఖాధికారి టి.వెంకట సునీల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

మే 15 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచారు.

విద్యార్థులు https://admission.tirumala.org/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే "Student Manual in English" లేదా "Student Manual in Telugu" రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని చదివి అర్థం చేసుకోవాలి.

అన...