భారతదేశం, మే 26 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు.. తమ ఉనికిని చాటుతున్నాయి. అందుకు ఉదాహరణ.. ఇంటర్‌ ప్రవేశాల్లో వీటికున్న డిమాండ్. టీటీడీ బాల బాలికలకు ప్రత్యేకంగా రెండు జూనియర్‌ కాలేజీలను నిర్వహిస్తోంది. బధిర విద్యార్థులకు ప్రత్యేకంగా మరోటి ఉంది. చాలా తక్కువ ఫీజులు ఉండటం, ఉత్తమ బోధన, వసతి సౌకర్యం, సైన్స్‌ విద్యార్థులకు తగినన్ని ప్రయోగశాలలు, సరైన క్రీడా మైదానాలు ఉండటంతో.. రాయలసీమలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ సీటు కోసం ఎక్కువగా పోటీ పడుతున్నారు.

ఎస్వీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఏటా 792 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఫస్ట్, సెకెండ్ ఇయర్ విద్యార్థులకు కలిపి 600 మంది విద్యార్థులకు వసతిగృహం సౌకర్యం ఉటుంది. బాలికల కోసం శ్రీపద్మావతి జూనియర్‌ కళాశాల ఉంది. ఇక్కడ 968 మందికి ప్రథమ సంవత్సరం...