భారతదేశం, డిసెంబర్ 29 -- శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుకుంటాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. మెుదటి మూడు రోజులు.. ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఇప్పటికే ఈ డిప్ విధానంలో టోకెన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో టోకెన్లు ఉన్నవారికి దర్శనం ఉంటుందని చాలాసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పింది.

మెుదటి మూడు రోజులు ఈ డిప్ ద్వారా టోకెన్లతో వచ్చిన భక్తులకు దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది. 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఉంటుంది టీటీడీ ఛైర్మన్ ఇప్పటికే వెల్లడించారు. మెుదటి మూడు రోజులు ఈ డ...