భారతదేశం, డిసెంబర్ 30 -- తిరుమలలో కొత్త ఏడాదిలో జరిగే విశేష పర్వదినాల గురించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు అధికారులు ప్రకటించారు. జనవరి 4న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర, 12న అధ్యయనోత్సవాలు సమాప్తి కార్యక్రమాలను నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నెలకొన్నది. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్...