భారతదేశం, డిసెంబర్ 24 -- జనవరిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఏ ఆలయాల్లో ఎలాంటి ఉత్సవాలు ఉన్నాయో తెలుసుకుని వస్తే బెటర్. తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే.. తిరుపతిలోనూ ఆలయాలను సందర్శించుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి నెల‌లో జరుగనున్న విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆ వివరాలు చూద్దాం..

మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ ఏర్పాట్ల చేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేశారు. రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

డిసెంబర్ 30న వైకుంఠ ఏక...